BREAKING
thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం
Test 4
Date of Publish : 25 November 2026, 07:45 am
Posted by : K MAHESH

నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 07:45 AM
22 వీక్షణలు

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, తప్పుల సవరణలకు డిసెంబర్ 10 వరకు గడువు

హైదరాబాద్, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్:

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు నేడు (నవంబర్ 25) విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో ఈ జాబితాను ప్రకటించనున్నారు.

ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో గ్రాడ్యుయేట్లు పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. పేర్లు నమోదు కాకపోయినా, వ్యక్తిగత వివరాల్లో తప్పులు ఉన్నా నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులైన గ్రాడ్యుయేట్లు ఫారం-18 ద్వారా డిసెంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జాబితాలో పేర్లు, ఇతర వివరాలకు సంబంధించి అభ్యంతరాలు తెలియజేయడానికి, తప్పులను సరిచేయించుకోవడానికి కూడా డిసెంబర్ 10 వరకు అవకాశం కల్పించారు.

ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 12.69 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఓటర్ల నమోదు, జాబితా సవరణలకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం 1950 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కలిగిన అర్హులైన ప్రతి ఒక్కరూ ముసాయిదా జాబితాను పరిశీలించి, అవసరమైన సవరణలను గడువులోగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.