BREAKING
thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం
Date of Publish : 13 October 2026, 04:51 pm
Posted by : A. MURALIDHAR

పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
13 Oct, 2026 - 04:51 PM
12 వీక్షణలు

చౌడేపల్లి, అన్నమయ్య జిల్లా:

చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలోని వైష్ణవి దేవి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు భాగంగా అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం సకల ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో గాయత్రీ దేవి రూపంలో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. అమ్మవారి దివ్య దర్శనం కోసం చౌడేపల్లి మండలంలోని పరిసర గ్రామాలతో పాటు బెంగళూరు, మదనపల్లి, పుంగనూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆ రోజు ఉభయదారులుగా లద్దిగం గ్రామానికి చెందిన పచ్చిరాళ్ల కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ అర్చకురాలు శ్రావణి, ధర్మకర్త వినోద్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.