BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 08:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Sep, 2026 - 08:39 PM
17 వీక్షణలు

ఏ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో సీపీఐ ఆధ్వర్యంలో కరువు పరిశీలన యాత్ర

ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఏ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో సీపీఐ ఆధ్వర్యంలో కరువు పరిశీలన యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో పంట పొలాలు, చెరువులను పరిశీలించి రైతుల పరిస్థితులను నాయకులు తెలుసుకున్నారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ తీవ్ర వర్షాభావం కారణంగా ఖరీఫ్ సీజన్‌లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. జిల్లాలో 291 చెరువులు ఎండిపోయిన పరిస్థితి నెలకొందని, దీంతో సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పంటల సాగుపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు.

రబీ సీజన్ సమీపిస్తున్నప్పటికీ రైతులకు భరోసా కల్పించే చర్యలు ప్రభుత్వం చేపట్టడం లేదని సీపీఐ నాయకులు విమర్శించారు. కరువు ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు పంటల బీమా, రుణ సదుపాయాలతో పాటు అవసరమైన అన్ని రకాల ప్రభుత్వ సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు.

కరువు పరిస్థితులపై ప్రభుత్వం సమగ్రంగా అంచనా వేసి ఎన్టీఆర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ నాయకులు కోరారు. రైతుల పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించడంతో పాటు రబీ సాగుకు అవసరమైన విత్తనాలు, సాగునీరు, రుణ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కరువు సంక్షోభం నుంచి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని దోనేపూడి శంకర్ కోరారు.