BREAKING
thumb ● అగ్నివీర్ సర్వీసు కాలం పెంపునకు కేంద్రం యోచన thumb ● ఒకే రోజు 5 లక్షల మందికి ఉపాధి హామీ పనులు thumb ● తెలంగాణలో ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు thumb ● డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి thumb ● నీటి ఎద్దడి ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌లో ముందుగానే దీపావళి సెలవులు thumb ● చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు thumb ● బల్సుల భాగ్యమ్మ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● అగ్నివీర్ సర్వీసు కాలం పెంపునకు కేంద్రం యోచన thumb ● ఒకే రోజు 5 లక్షల మందికి ఉపాధి హామీ పనులు thumb ● తెలంగాణలో ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు thumb ● డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి thumb ● నీటి ఎద్దడి ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌లో ముందుగానే దీపావళి సెలవులు thumb ● చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు thumb ● బల్సుల భాగ్యమ్మ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
Test 4
Date of Publish : 04 November 2026, 06:56 am
Posted by : KOLA MAHESH

తెలంగాణలో ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
04 Nov, 2026 - 06:56 AM
21 వీక్షణలు

33 జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు.. స్థానికంగానే కీమోథెరపీ సేవలు

హైదరాబాద్, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): తెలంగాణలో క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

జిల్లాల్లోనే క్యాన్సర్ చికిత్సకు ఏర్పాట్లు

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేసి, స్థానికంగానే కీమోథెరపీ సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సాధారణ కీమోథెరపీ చికిత్స కోసం ప్రతిసారీ హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లోనే వైద్య సేవలను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు.

రీజినల్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులను తగ్గించడంపై దృష్టి సారిస్తోంది.

క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపుపై దృష్టి

క్యాన్సర్ బాధితుల వివరాలను మ్యాపింగ్ చేయడం, వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు.

ఈ అంశాలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహ పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో క్యాన్సర్ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.