బల్సుల భాగ్యమ్మ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మాజీ జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి
చిట్టంపహాడ్, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్):
నాంపల్లి మండలం చిట్టంపహాడ్ గ్రామానికి చెందిన బల్సుల భాగ్యమ్మ ఆకస్మికంగా మృతి చెందడంతో మాజీ జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే గ్రామానికి చేరుకుని భాగ్యమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కుటుంబానికి ఆర్థిక సహాయం
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మృతురాలి కుమారుడు నాగశ్రవణ్‌కు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నాయిని జగన్ మోహన్ రెడ్డి, అబ్బనబోయిన చందు యాదవ్, నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్, యువ నాయకుడు గజ్జెల శివారెడ్డి, మహమ్మదాపురం మాజీ సర్పంచ్ మల్గిరెడ్డి చంద్రారెడ్డి, సపావత్ సర్దార్, గజ్జెల గెల్వాల్ రెడ్డి, గ్రామస్థులు అంజయ్య, రమేష్, శ్రీవివాస్ రెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.