BREAKING
thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి
మంచి మాట
Date of Publish : 03 November 2026, 08:16 pm
Posted by : KOLA MAHESH

DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
03 Nov, 2026 - 08:16 PM
9 వీక్షణలు

నియామక పత్రం అందజేసిన రాష్ట్ర కార్యదర్శి కేలోతు సాయికుమార్, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ నాయక్

మహబూబాబాద్, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (DSFI) మహబూబాబాద్ టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయిని నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేలోతు సాయికుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ నాయక్, గుగులోతు శివవర్మ సాయికి నియామక పత్రాన్ని అందజేశారు.

విద్యార్థుల హక్కుల పరిరక్షణే లక్ష్యం

ఈ సందర్భంగా DSFI నాయకులు మాట్లాడుతూ పట్టణ స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణ లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ, విద్యారంగంలో నెలకొన్న అసమానతలను తొలగించేందుకు DSFI కృషి చేస్తోందని పేర్కొన్నారు. సంఘం సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ విద్యార్థులను ఐక్యం చేసి వారి హక్కుల సాధనకు బానోతు సాయి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యార్థుల సమస్యలపై పోరాటానికి పిలుపు

పట్టణ పరిధిలో DSFI కమిటీలను విస్తరించి విద్యార్థులను సంఘటితం చేయాలని సూచించారు. ఫీజుల సమస్యలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా సౌకర్యాలు తదితర అంశాలపై విద్యార్థుల తరఫున ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు.

విద్యార్థుల గొంతుకగా DSFIని మరింత బలోపేతం చేస్తూ భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు.