బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: మండల అధ్యక్షుడు గుగులోతు జవహర్‌లాల్ నాయక్
నెల్లికుదురు, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
బీజేపీ ఎస్టీ మోర్చా నెల్లికుదురు మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్‌లను నియమించినట్లు ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు గుగులోతు జవహర్‌లాల్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చందు రాజ్‌కుమార్ యాదవ్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు జవహర్‌లాల్ నాయక్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు మండలంలో ఎస్టీ మోర్చాను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాన కార్యదర్శుల నియామకం చేపట్టినట్లు తెలిపారు.
నూతనంగా నియమితులైన నవీన్, మహేందర్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మండలంలో బీజేపీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన నూతన కార్యదర్శులు
నూతనంగా నియమితులైన వారు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తెలిపారు. తమ నియామకానికి సహకరించిన జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సుందర్ నాయక్, ఎస్సీ మోర్చా నాయకుడు గద్దల ఐలయ్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.