ఆదోని మున్సిపల్ పీఠంపై స్వతంత్ర అభ్యర్థి స్వప్న నాయకర్ విజయం
ఆంధ్రప్రదేశ్
/
కర్నూలు
2,061 ఓట్ల మెజారిటీతో టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థులపై ఘన విజయం
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి స్వప్న నాయకర్ ఘన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా చైర్‌పర్సన్ స్థానం తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో, జనసేన పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థిగా స్వప్న నాయకర్ ఉంగరం గుర్తుపై ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆమె 2,061 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. టీడీపీ అభ్యర్థి పి. నాగమణి, వైఎస్సార్సీపీ అభ్యర్థి జి. ప్రణీతపై ఆధిక్యం సాధించి ఆదోని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. జనసేన పార్టీ ఇన్‌చార్జి మల్లప్ప సతీమణి అయిన స్వప్న నాయకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.