BREAKING
thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి
మంచి మాట
Date of Publish : 03 November 2026, 08:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు మున్సిపాలిటీలో టీడీపీ విజయభేరి 36 వార్డులకు గాను 21 స్థానాలు కైవసం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Nov, 2026 - 08:21 PM
34 వీక్షణలు

నూజివీడు మున్సిపాలిటీలో టీడీపీ విజయభేరి 36 వార్డులకు గాను 21 స్థానాలు కైవసం వైసీపీకి 12, జనసేనకు 2, స్వతంత్ర అభ్యర్థికి ఒక స్థానం చైర్మన్ స్థానంతో పాటు కౌన్సిల్‌పై టీడీపీ పట్టు

నూజివీడు, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్): నూజివీడు మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలో ఈసారి జరిగిన ఎన్నికల్లో టీడీపీ స్పష్టమైన మెజారిటీతో కౌన్సిల్‌పై పట్టు సాధించింది. మొత్తం 36 వార్డులకు గాను టీడీపీ అభ్యర్థులు 21 స్థానాల్లో విజయం సాధించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను దక్కించుకుంది. జనసేన పార్టీ రెండు వార్డుల్లో గెలుపొందగా, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. దీంతో నూజివీడు మున్సిపల్ కౌన్సిల్‌లో టీడీపీకి స్పష్టమైన మెజారిటీ లభించింది. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజా 16,701 ఓట్లు సాధించి, తన సమీప వైసీపీ ప్రత్యర్థి కంచర్ల లవకుమార్‌పై 4,180 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా కౌన్సిలర్ స్థానాల ఫలితాలు కూడా టీడీపీకి అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. విజయం సాధించిన వార్డు కౌన్సిలర్లు వీరే 1వ వార్డు – గోపిశెట్టి నారాయణ (జనసేన) 2వ వార్డు – తలపంటి శివకుమారి (టీడీపీ) 3వ వార్డు – పల్లి నాగరాజు (టీడీపీ) 4వ వార్డు – షేక్ రెహనా బేగం (వైసీపీ) 5వ వార్డు – బొబ్బిలి ఉషారాణి (జనసేన) 6వ వార్డు – పగడాల సత్యనారాయణ (టీడీపీ) 7వ వార్డు – కందుల సత్యనారాయణ (టీడీపీ) 8వ వార్డు – వైఎస్ఆర్ కె. ప్రసాద్ (టీడీపీ) 9వ వార్డు – చెరుకూరి దుర్గాప్రసాద్ (టీడీపీ) 10వ వార్డు – వేముల రంగబాబు (టీడీపీ) 11వ వార్డు – బాణావతి చిన్ని (టీడీపీ) 12వ వార్డు – కోడూరి ప్రియ స్వప్న (టీడీపీ) 13వ వార్డు – మేకల అనిల్ కుమార్ (టీడీపీ) 14వ వార్డు – తిరుమల శెట్టి సాధన లక్ష్మీ స్రవంతి (టీడీపీ) 15వ వార్డు – తల్లారి సతీష్ (వైసీపీ) 16వ వార్డు – కొడవటి జ్యోతి (వైసీపీ) 17వ వార్డు – రామకృష్ణ ఫణి కాంత్ బసవ (వైసీపీ) 18వ వార్డు – శీలం అనిత (వైసీపీ) 19వ వార్డు – శీలం రామయ్య రావు (వైసీపీ) 20వ వార్డు – దాసరి స్వాతి (టీడీపీ) 21వ వార్డు – పడాల రూప లక్ష్మి (వైసీపీ) 22వ వార్డు – తుమ్మలపల్లి విజయలక్ష్మి (టీడీపీ) 23వ వార్డు – తురక ఝాన్సీ రాణి (టీడీపీ) 24వ వార్డు – కలపాల నాగమణి (వైసీపీ) 25వ వార్డు – ముల్లంగి మోహనరావు (టీడీపీ) 26వ వార్డు – షేక్ యూనిస్ భాష (వైసీపీ) 27వ వార్డు – కొలుసు విజయ గౌరీ (టీడీపీ) 28వ వార్డు – కొమరగిరి వాసు (వైసీపీ) 29వ వార్డు – కొమ్ము వెంకటేశ్వరరావు (వైసీపీ) 30వ వార్డు – మళ్లీ శెట్టి ప్రియదర్శిని (టీడీపీ) 31వ వార్డు – పాదం సత్యనారాయణ (టీడీపీ) 32వ వార్డు – రామిశెట్టి ప్రసన్నలక్ష్మి (టీడీపీ) 33వ వార్డు – కటారి సావిత్రి (వైసీపీ) 34వ వార్డు – రాయి రంగారావు (టీడీపీ) 35వ వార్డు – మేకల రమాదేవి (టీడీపీ) 36వ వార్డు – గొల్లు దుర్గాదేవి (స్వతంత్ర) మొత్తంగా 36 వార్డులకు గాను 21 స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ నూజివీడు మున్సిపాలిటీలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. చైర్మన్ స్థానంతో పాటు కౌన్సిల్‌లోనూ మెజారిటీ సాధించడంతో మున్సిపాలిటీ పాలనలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం లభించినట్లయింది.