కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు
గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం: డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు
మహబూబాబాద్, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొమురం భీం విగ్రహానికి డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
గిరిజన హక్కుల కోసం కొమురం భీం పోరాటం చిరస్మరణీయం
ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం కొమురం భీం చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. 'జల్–జంగల్–జమీన్' నినాదంతో గిరిజన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు విద్య, ఉపాధి, అభివృద్ధి రంగాల్లో సమాన అవకాశాల సాధన కోసం నిరంతరం పోరాడాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయికుమార్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమా నాయక్, మహబూబాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం.డి. ఫరీద్, డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు గుగులోతు సూర్య ప్రకాష్, భూక్యా శ్రీకాంత్, జవహర్, శివవర్మ, రమేష్, దేవేందర్, నవీన్, ఎం.డి. సల్మాన్, గౌతమ్, నవదీప్, రాకేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.