BREAKING
thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి
మంచి మాట
Date of Publish : 03 November 2026, 08:19 pm
Posted by : KOLA MAHESH

ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
03 Nov, 2026 - 08:19 PM
12 వీక్షణలు

డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలి: సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కందునూరి శ్రీనివాస్

గార్ల, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించి, ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కందునూరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గార్ల మండలం ముల్కనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఎదుట తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశా డే సందర్భంగా ఆందోళన నిర్వహించారు.

ఆశా వర్కర్లకు తగిన వేతనాలు చెల్లించాలి

ఈ సందర్భంగా కందునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ అతి తక్కువ వేతనాలతో ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ప్రోత్సహించడంతో పాటు తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రజారోగ్య వ్యవస్థలో ఎంతో ముఖ్యమైన సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు తగిన వేతనాలు చెల్లించకపోవడం విచారకరమని అన్నారు.

డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె

గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు సమ్మె నోటీసును వైద్యాధికారులకు అందజేశారు.

పాల్గొన్న ఆశా వర్కర్లు

ఈ కార్యక్రమంలో యూనియన్ ఆశా అధ్యక్షురాలు నమ్మి, కార్యదర్శి పి. రమాదేవి, జిల్లా నాయకులు రమణ, కౌసల్య, ఉమాదేవి, సుజాత, ధర్మి, పుష్ప, ఆశాకుమారి, జ్యోతి, నీల, భద్రమ్మ, సోనీ, నిరోషా తదితర ఆశా వర్కర్లు పాల్గొన్నారు.