BREAKING
thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి
మంచి మాట
Date of Publish : 03 November 2026, 08:18 pm
Posted by : KOLA MAHESH

అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
03 Nov, 2026 - 08:18 PM
10 వీక్షణలు

అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి లక్ష్యాల సాధనలో ముందుకు సాగాలి: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న

మహబూబాబాద్, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

భూమి, భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ అమరవీరుల ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మండల వెంకన్న పిలుపునిచ్చారు.

పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ 3న కురవి మండలం రాజోలు, బాలు తండ గ్రామాల్లో అమరులు కామ్రేడ్స్ గంగుల వరదయ్య, మలోత్ ఆలా, కర్రి రమేష్ స్థూపాల వద్ద ఎర్రజెండాలు ఎగురవేసి నివాళులర్పించారు.

అమరవీరుల త్యాగాలు మరువలేనివి

న్యూడెమోక్రసీ కురవి సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ సామ పాపయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల వెంకన్న మాట్లాడుతూ గోదావరి లోయ పరీవాహక ప్రాంతంలో వేలాది ఎకరాల పోడు భూములను పేద ప్రజలకు పార్టీ ఆధ్వర్యంలో పంచినట్లు తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహించిన పోరాటాల్లో ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారని పేర్కొన్నారు.

విప్లవకారులను రాజ్యం బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో హత్య చేసిందని ఆయన ఆరోపించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధన కోసం ముందుకు సాగడమే వారికి అందించే నిజమైన నివాళి అని అన్నారు. అమరవీరుల లక్ష్యాల సాధన కోసం ప్రజలు ముందుండాలని పిలుపునిచ్చారు.

పాల్గొన్న పార్టీ నాయకులు

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ నాయకుడు కామ్రేడ్ హలావత్ లింగన్న, నాయకులు కామ్రేడ్ ఎస్.కె. బాబు, కోబాల్, గండు కృష్ణ, దేపంగి బిక్షం, వీరన్న, మలోత్ సురేష్, రవి, వీరన్న, నరేష్, భుక్య జమ్ల, మల్లేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.