BREAKING
thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి
మంచి మాట
Date of Publish : 03 November 2026, 08:13 pm
Posted by : KOLA MAHESH

నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
Kola Mahesh Munugodu Constituency
03 Nov, 2026 - 08:13 PM
15 వీక్షణలు

నవంబర్ 15న జరిగే సభను విజయవంతం చేయాలి: సీపీఎం నాయకులు జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం

రామన్నపేట, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

నవంబర్ 15న నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల సందర్భంగా జరిగే రైతు బహిరంగ సభకు గ్రామీణ ప్రాంతాల రైతులు అధిక సంఖ్యలో తరలిరావాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, రామన్నపేట మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం పిలుపునిచ్చారు.

గ్రామాల్లో ప్రచార కార్యక్రమం

అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ నాయకులు ఇస్కిళ్ల, దుబ్బాక గ్రామాల్లో రైతులతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం, రైతుల హక్కుల సాధన కోసం జరిగే ఉద్యమాల్లో రైతులు భాగస్వాములు కావాలని కోరారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులంతా ఐక్యంగా తమ గొంతుక వినిపించాలని పిలుపునిచ్చారు.

ప్రతి గ్రామం నుంచి రైతులు హాజరుకావాలి

నవంబర్ 15న నల్లగొండలో నిర్వహించే బహిరంగ సభకు ప్రతి గ్రామం నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి గన్నేబోయిన విజయభాస్కర్, దుబ్బాక గ్రామ సర్పంచ్ గట్టు నర్సింహ, మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్, రైతు సంఘం నాయకులు మేడబోయిన శ్రీనివాస్, వల్లమళ్ల నర్సింహ, గుడిసె లింగస్వామి, గుండాల బిక్షం, పుట్టల ఉదయ్ కుమార్, గాదె పరమేష్, గుండాల నరేష్, కొమ్ము నరేష్ తదితరులు పాల్గొన్నారు.