BREAKING
thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి
మంచి మాట
Date of Publish : 03 November 2026, 09:07 pm
Posted by : P GAJENDRA BABU

శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
03 Nov, 2026 - 09:07 PM
23 వీక్షణలు

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో విజ్ఞప్తి

శ్రీకాళహస్తి, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను అభ్యర్థించారు.

పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం

జడ్పీటీసీ కూటమి అభ్యర్థి రావిళ్ల మునిరాజా నాయుడు, గారు ఎంపీటీసీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రిషితా రెడ్డి గారు పొయ్య కొత్తూరు, పొయ్య, కురవకానేరి, లింగమునాయుడుపల్లి, గుమ్మడిగుంట గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లోని ఎస్టీ, ఎస్సీ కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ప్రచారానికి వెళ్లిన ఆమెకు పలు గ్రామాల్లో మహిళలు, స్థానికులు హారతులు పట్టి, పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని కూటమి నాయకులు తెలిపారు.

సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి

ఈ సందర్భంగా రిషితా రెడ్డి, స్థానిక నాయకులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థి రావిళ్ల మునిరాజా నాయుడుగారితో పాటు కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అభ్యర్థుల విజయంతో మండల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రచారానికి ప్రజల నుంచి లభిస్తున్న స్పందనతో కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.