రాష్ట్రం అంతా ఒకవైపు.. నందికొట్కూరు మరోవైపు
రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా.. నందికొట్కూరులో వైసీపీ జెండా
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికర రాజకీయ పరిణామాలకు వేదికయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆధిపత్యం కొనసాగుతుండగా, నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మున్సిపాలిటీలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. మొత్తం 32 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 23 వార్డులను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యత సాధించింది. అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీ 9 వార్డులకే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి విజయాలు నమోదు చేస్తున్న వేళ నందికొట్కూరులో వైసీపీ ఘన విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఫలితం వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.