BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 04 November 2026, 07:01 am
Posted by : K MAHESH

అగ్నివీర్ సర్వీసు కాలం పెంపునకు కేంద్రం యోచన

జాతీయం జాతీయం
Reporter
K Mahesh Munugodu Constituency
04 Nov, 2026 - 07:01 AM
212 వీక్షణలు

నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంపు ప్రతిపాదన? శాశ్వత సైనికులుగా ఎంపిక చేసే శాతం పెంపుపైనా పరిశీలన

న్యూఢిల్లీ, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకంలో కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అగ్నివీరులకు ఉన్న నాలుగేళ్ల సర్వీసు కాలాన్ని ఆరేళ్లకు పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఆరేళ్లకు సర్వీసు కాలం పెంపు?

ప్రస్తుతం అమల్లో ఉన్న అగ్నిపథ్ పథకం ప్రకారం అగ్నివీరులు నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవలందిస్తారు. ఈ కాలాన్ని మరో రెండేళ్లు పెంచి ఆరేళ్లకు చేయాలనే ప్రతిపాదనపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు.

శాశ్వత నియామకాల శాతం పెంపుపై చర్చ

ప్రస్తుతం నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత అర్హత, ఎంపిక ప్రక్రియ ఆధారంగా గరిష్ఠంగా 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే రెగ్యులర్ కేడర్‌లో కొనసాగిస్తున్నారు. ఈ శాతాన్ని పెంచే అంశాన్ని కూడా త్రివిధ దళాలు ప్రతిపాదించినట్లు సమాచారం.

నవంబర్ 21న కీలక ప్రకటన వస్తుందా?

ఈ ప్రతిపాదనలపై రక్షణ శాఖ నవంబర్ 21లోపు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సర్వీసు కాలం పెంపు, శాశ్వత నియామకాల శాతంలో మార్పులపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.