BREAKING
thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 06:09 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మురసు తుఫాను సహాయక చర్యలకు 5 రాష్ట్రాల్లో 38 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరింపు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
03 Nov, 2026 - 06:09 PM
7 వీక్షణలు

తీవ్ర ప్రభావిత ఆంధ్రప్రదేశ్‌లో 14 బృందాలతో సహాయక చర్యలు.. తమిళనాడు నుంచి మరో 3 బృందాల తరలింపు

దిల్లీ (ఎన్ టుడే న్యూస్):

మురసు (Murasu) తుఫాను నేపథ్యంలో సహాయక, అత్యవసర చర్యలను వేగవంతం చేసేందుకు ఐదు రాష్ట్రాల్లో మొత్తం 38 ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 14 బృందాలు

తుఫాను ప్రభావం అత్యధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ఠంగా 14 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. అదనంగా తమిళనాడు నుంచి మరో మూడు బృందాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.

ప్రస్తుతం ప్రాణనష్టం నమోదు కాలేదు

తుఫాను పరిస్థితులపై దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎన్డీఆర్‌ఎఫ్ డీఐజీ మొహసిన్ షాహేదీ.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదని వెల్లడించినట్లు సమాచారం. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.