BREAKING
thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 05:50 pm
Posted by : KOLA MAHESH

పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
03 Nov, 2026 - 05:50 PM
3 వీక్షణలు

కాకతీయ విశ్వవిద్యాలయ యువజన విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం.. పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు

హనుమకొండ, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయ యువజన విభాగం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో పట్టభద్రులు, ప్రొఫెసర్లు, అధ్యాపకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యావేత్తలు, పట్టభద్రులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొ. వెంకట నారాయణ, లైబ్రరీ చైర్మన్ ఎండీ అజీజ్ ఖాన్, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయ్యూబ్ తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రుల ఓటర్ల నమోదు కీలకం: ఇనగాల

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. కాకతీయ విశ్వవిద్యాలయ యువజన విభాగం పట్టభద్రులు, మేధావులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమావేశం నిర్వహించడం అభినందనీయమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఉన్నత విద్యావంతుడైన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణమని పేర్కొన్నారు.

సర్వోత్తమ్ రెడ్డి కుటుంబానికి నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో అనుబంధం ఉందని తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రజా మద్దతు ఉందని ఆయన అన్నారు.

తన ప్రసంగంలో ఓటర్ల నమోదు వివరాలను ప్రస్తావిస్తూ.. ఫామ్-18 ద్వారా మూడు జిల్లాల్లో 4.58 లక్షలకు పైగా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. హనుమకొండ జిల్లా నుంచి 43,997 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో యువత, న్యాయవాదులు, అధ్యాపకులు, పట్టభద్రులంతా ఏకతాటిపైకి వచ్చి సర్వోత్తమ్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు.

విద్యావంతుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: సర్వోత్తమ్ రెడ్డి

ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. కాకతీయ విశ్వవిద్యాలయ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు, అధ్యాపకులు, మేధావులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో, ఈ ప్రాంత ప్రజలతో నాలుగు తరాల అనుబంధం ఉందని చెప్పారు. తన తండ్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా ప్రజలకు చేసిన సేవలు తనకు మార్గదర్శకమని పేర్కొన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసి, అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించిన విద్యావంతుడిగా, యువజన కాంగ్రెస్ నుంచి పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన కార్యకర్తగా పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు అవగాహన ఉందన్నారు. శాసనమండలిలో విద్యావంతులు, ఉద్యోగుల గొంతుకగా నిలుస్తానని తెలిపారు.

కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రాధాన్యం

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని సర్వోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల అభివృద్ధి, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

విద్యార్థులను ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దేందుకు 'కే-హబ్' ద్వారా స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఫ్యాకల్టీ నియామకాలు, విశ్వవిద్యాలయానికి నిధుల కేటాయింపు వంటి అంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడం వంటి అంశాల్లో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం సమస్యలను శాసనమండలి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.