ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి
విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను ISMS పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టీకరణ
తెలంగాణ, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ISMS పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది.
పెండింగ్ వివరాలు వెంటనే నమోదు చేయాలి
జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలు ఇంకా నమోదు చేయని పాఠశాలలు వాటిని వెంటనే పూర్తి చేసి పోర్టల్‌లో సమర్పించాలని విద్యాశాఖ ఆదేశించింది.
ప్రతి నెలా ఒకటో తేదీన నమోదు
కేంద్ర విద్యాశాఖ తరచూ పాఠశాలల హాజరు వివరాలను కోరుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీన విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను తప్పనిసరిగా ISMS పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.