BREAKING
thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 06:07 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ హత్య.. మహిళను హతమార్చినట్లు ఆరోపణలు

తెలంగాణ
/ మహబూబ్ నగర్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
03 Nov, 2026 - 06:07 PM
5 వీక్షణలు

భూ వివాదం, కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన? నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కోయిలకొండ, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలం చింతల్ తండాలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. ఓ మహిళను ఆమె భర్త కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

పదేళ్ల క్రితం వివాహం

వివరాల్లోకి వెళ్తే.. కోయిలకొండ మండలం చింతల్ తండాకు చెందిన కాట్రావత్ బలరాంకు, ఓబ్లాయిపల్లి తండాకు చెందిన కాట్రావత్ సునీతతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రిషిక, శైలజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బలరాంకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు, ఈ నేపథ్యంలో కుటుంబంలో పలుమార్లు గొడవలు జరిగినట్లు సమాచారం.

భూమి సునీత పేరు మీద రిజిస్ట్రేషన్

ఏడాది క్రితం బలరాంను అతని అన్నలు మాన్యనాయక్, పాండునాయక్ హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పెద్దమనుషుల సమక్షంలో జరిగిన తీర్పు మేరకు బలరాంకు చెందిన ఎకరంన్నర భూమిని సునీత పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. భర్త హైదరాబాద్‌కు వెళ్లడంతో సునీత తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది.

పొలం వద్దకు వెళ్తుండగా దాడి

ఇటీవల సునీత తిరిగి చింతల్ తండాకు వచ్చి పొలం వద్దకు వెళ్తుండగా మాన్యనాయక్ ఆమెపై దాడి చేసి ఇంటికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ పాండునాయక్, అతని భార్య పార్వతి, మాణిక్యనాయక్ అనే మరో వ్యక్తి కలిసి సునీతపై దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.

నలుగురు నిందితులు పోలీసుల అదుపులో

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు దారితీసిన పరిస్థితులు, భూ వివాదం పాత్ర తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.