వృద్ధురాలితో సీఎం విజయ్ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు
ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా వృద్ధురాలితో సరదాగా ముచ్చటించిన ముఖ్యమంత్రి
తమిళనాడు (ఎన్ టుడే న్యూస్):
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన నిరాడంబరతతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
వృద్ధురాలితో ఆప్యాయంగా ముచ్చట్లు
కార్యక్రమానికి హాజరైన ఓ వృద్ధురాలు సీఎం విజయ్‌ను ఆప్యాయంగా పలకరించారు. అంతేకాకుండా ఆయన భుజంపై చేయి వేసి ఫొటోకు పోజిచ్చారు. దీనికి విజయ్ కూడా ఎంతో సానుకూలంగా స్పందించారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఆమెతో సరదాగా మాట్లాడుతూ ఆప్యాయంగా ఫొటోలకు ఫోజులిచ్చారు.
సోషల్ మీడియాలో వైరల్
వృద్ధురాలితో సీఎం విజయ్ ఆత్మీయంగా మెలిగిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ సాధారణ వ్యక్తిలా వృద్ధురాలితో కలిసిపోయిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన నిరాడంబరత, ఆప్యాయత ఆకట్టుకుంటున్నాయని కామెంట్లు చేస్తున్నారు.