BREAKING
thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 05:57 pm
Posted by : PEDDABOINA SRIKANTH

సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

తెలంగాణ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
03 Nov, 2026 - 05:57 PM
4 వీక్షణలు

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులతో ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు

హనుమకొండ, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

ఉమ్మడి వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

అమరవీరులకు నివాళులు

సమావేశానికి ముందు తెలంగాణ అమరవీరులకు నాయకులు నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సర్వోత్తమ్ రెడ్డి విజయానికి మద్దతు కోరారు.

ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి

ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యావంతుల సమస్యల పరిష్కారం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన, ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

కాకతీయ విశ్వవిద్యాలయం ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

పట్టభద్రుల గొంతుకగా నిలవాలి

విద్యావేత్తలకు శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పుల భారాన్ని ఎదుర్కొందని విమర్శించారు. పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేసే అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఉద్యోగులు, విద్యార్థులు, పట్టభద్రులు, మేధావులకు విజ్ఞప్తి చేశారు.