భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక
నారాయణపురం మండలం నుంచి నలుగురికి డైరెక్టర్ పదవులు.. నియామక ప్రొసీడింగ్ కాపీలు అందజేత
నారాయణపురం, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి డివిజన్ ఆత్మ (ATMA) డైరెక్టర్‌గా నారాయణపురం మండలానికి చెందిన రాచకొండ రమేష్ ఎంపికయ్యారు.
నలుగురికి నియామక పత్రాలు అందజేత
మంగళవారం నారాయణపురం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలం నుంచి ఆత్మ డైరెక్టర్లుగా ఎంపికైన రాచకొండ రమేష్, ఎర్ర వెంకటేష్, కొర్ర ఫరంగి, సుర్కంటి రంగారెడ్డిలకు జిల్లా వ్యవసాయ శాఖ జారీ చేసిన నియామక ప్రొసీడింగ్ కాపీలను మండల వ్యవసాయ అధికారి పూజ అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపికైన డైరెక్టర్లను అభినందించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు సైదులు, నవ్య, త్రివేణి, గ్రామ ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, ఎఫ్‌పీఓ ప్రతినిధి జక్కిడి మధుసూదన్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ ఉప్పల కృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.