3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు
ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు.. తొమ్మిది నెలల్లో 675 టన్నులకు చేరిన నిల్వలు
ప్రపంచం (ఎన్ టుడే న్యూస్):
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తన నివేదికలో వెల్లడించింది.
మూడో త్రైమాసికంలో 321 టన్నులు
WGC నివేదిక ప్రకారం.. 2026 జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న మూడో త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు 321 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. దీంతో ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో కేంద్ర బ్యాంకుల మొత్తం బంగారం కొనుగోళ్లు 675 టన్నులకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ కొనుగోళ్లు 6 శాతం అధికంగా నమోదయ్యాయి.
మొత్తం డిమాండ్‌లో స్వల్ప తగ్గుదల
మరోవైపు, ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం బంగారం డిమాండ్ 1 శాతం తగ్గి 1,369 టన్నులకు చేరినట్లు WGC నివేదిక పేర్కొంది. మొత్తం డిమాండ్‌లో స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు మాత్రం బంగారం మార్కెట్‌లో కీలక అంశంగా నిలుస్తున్నాయి.