మురసు తుఫాన్ ప్రభావం.. ఎన్టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
విద్యార్థుల భద్రత దృష్ట్యా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నిర్ణయం
మురసు తుఫాన్ ప్రభావం.. ఎన్టీఆర్ జిల్లాలో బుధవారం విద్యాసంస్థలకు సెలవు విద్యార్థుల భద్రత దృష్ట్యా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నిర్ణయం పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు వర్తింపు
విజయవాడ: మురసు తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీ బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ సెలవు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలు, అధికారులు ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. తల్లిదండ్రులు అత్యవసరమైతే తప్ప పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపవద్దని కోరారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలు, కాలువలు, చెరువులు, నీటి ప్రవాహాల వద్దకు పిల్లలు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ప్రజలు గమనించాలని, అధికారులకు సహకరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.