కొండేపిలో అక్టోబర్ 14న ఉచిత మెగా వైద్య శిబిరం
కొండేపి, అక్టోబర్ 13: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ ఆధ్వర్యంలో అక్టోబర్ 14, 2026న కొండేపి సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ శిబిరంలో గైనకాలజీ, చిన్నపిల్లల వైద్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, చర్మవ్యాధులు, కంటి వైద్యం, ఎముకల వైద్యం, దంత వైద్యం, ఆయుర్వేద విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించనున్నారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు, రక్తదాన ప్రతిజ్ఞ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
హెచ్‌సీజీ ఎంఎన్‌ఆర్ క్యాన్సర్ ఆసుపత్రి నిపుణుల బృందం ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. 50 ఏళ్లు పైబడిన పురుషులకు పీఎస్‌ఏ పరీక్ష, 45 ఏళ్లు పైబడిన మహిళలకు రొమ్ము థర్మల్ స్కానింగ్, సీఏ-125 పరీక్షలతో పాటు మహిళలకు పాప్ స్మియర్ పరీక్షలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స పొందేలా ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.
అలాగే షుగర్, కిడ్నీ పరీక్షలు, హిమోగ్లోబిన్, కొలెస్ట్రాల్, కామ