యంగ్ రింగ్స్ యూత్ ఆధ్వర్యంలో విగ్నేశ్వరుడికి పూజలు
ఊరుమడ్లలో ఘనంగా లక్ష్మీ గణపతి హోమం
నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, ఊరుమడ్ల: గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
యంగ్ రింగ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేదమంత్రాలు, పూజా కార్యక్రమాల మధ్య లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ అర్చకులు నున్న కృష్ణమోహనాచార్యులు, లక్ష్మి, మట్టిపల్లి నాగరాజు–సుగుణ, బోయ సైదులు–సుస్మిత, మట్టిపల్లి పురుషోత్తం–అనిత, మట్టిపల్లి రమేష్–గీత, గుండెబోయిన మహేష్, అనంతుల మల్లేష్, రొయ్య రాకేష్, సందీప్, జెమిని, మాదగోని శ్రీకాంత్, జె. రాము జాల. వినోద్ పాకాల నవీన్.
రాచమళ్ళ నరేష్. పాల్గొన్నారు.
గ్రామ ప్రజలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్ష్మీ గణపతి హోమాన్ని విజయవంతం చేశారు.