BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 20 June 2026, 10:39 pm
Posted by : బోరా శివారెడ్డి

గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
20 Jun, 2026 - 10:39 PM
194 వీక్షణలు

కాకినాడ జిల్లా, గొల్లప్రోలు, NToday News:

గొల్లప్రోలు గ్రామ శివార్లలో అక్రమంగా నాటు సారా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం, గొల్లప్రోలు ప్రాంతంలో నాటు సారా విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం అందడంతో ఎస్సై నౌడ్ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి గ్రామ శివార్లలోని ఓ లేఅవుట్ వద్ద నిఘా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అక్కడ నాటు సారా విక్రయం కోసం వేచి ఉన్న తాడిపర్తి గ్రామానికి చెందిన చింతల వెంకటేశ్వరరావు (50) పోలీసుల వాహనాన్ని గమనించి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసు సిబ్బంది అతడిని వెంబడించి పట్టుకున్నారు.

అనంతరం నిందితుడిని తనిఖీ చేయగా, విక్రయానికి సిద్ధంగా ఉంచిన 5 లీటర్ల నాటు సారా లభ్యమైంది. వెంటనే సారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నిందితుడిపై చట్టపరమైన కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై నౌడ్ రామకృష్ణ మాట్లాడుతూ, నియోజకవర్గంలో నాటు సారా విక్రయాలు వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.