BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 13 October 2026, 08:21 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్య పరిరక్షణ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Oct, 2026 - 08:21 AM
18 వీక్షణలు

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్య పరిరక్షణ రసాయన రహిత ఆహార పదార్థాల వినియోగంపై అవగాహన పెంచుకోవాలి తహశీల్దార్ బి.శ్వేత 

చాట్రాయి: సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చాట్రాయి తహశీల్దార్ బి. శ్వేత అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలను నిర్వహించారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో పండించిన ఆహార పదార్థాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఈ ఉత్పత్తుల విక్రయాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రదర్శనలో భాగంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, బెల్లం, ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కషాయాలను విక్రయానికి ఉంచారు. మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. రసాయన రహిత ఆహార పదార్థాల వినియోగంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఆదరించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి ఉత్పత్తులకు ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా కోరారు.