BREAKING
thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
Date of Publish : 13 October 2026, 09:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యూసీజీపై ఉన్నత స్థాయి అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Oct, 2026 - 09:38 PM
2 వీక్షణలు

యూసీజీపై ఉన్నత స్థాయి అవగాహన సదస్సు త్వరలో.. మంత్రులు, శాస్త్రవేత్తలతో చర్చలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ప్రజల్లోని అపోహలు తొలగించిన తర్వాతే ప్రాజెక్ట్ ముందుకు: ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

ఏలూరు జిల్లా: అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (UCG) ప్రాజెక్ట్‌పై ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి అవగాహన సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సదస్సులో మంత్రులతో పాటు శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొని ప్రాజెక్ట్ అమలు విధానం, భద్రతా చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

ఈ నేపథ్యంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిసి UCG ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

తన నియోజకవర్గ పరిధిలో అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్‌పై ప్రజల్లో పలు అనుమానాలు, అపోహలు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో నివృత్తి చేసిన తర్వాతే ప్రాజెక్ట్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ప్రజల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, శాస్త్రీయ అధ్యయనాలు, నిపుణుల సూచనలు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. UCG ప్రాజెక్ట్‌పై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు త్వరలో నిర్వహించే సదస్సు కీలకంగా మారనుంది.