BREAKING
thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 03:44 pm
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న అక్రమ అండాల సేకరణ ముఠా గుట్టురట్టు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
02 Nov, 2026 - 03:44 PM
13 వీక్షణలు
  • హైదరాబాద్‌ కేంద్రంగా అక్రమ అండాల సేకరణ.. 9 రాష్ట్రాలకు విస్తరించిన ముఠా!
  • 350 మంది మహిళల నుంచి అండాలు సేకరించినట్లు పోలీసుల గుర్తింపు..
  • ఇప్పటివరకు తొమ్మిది మంది అరెస్ట్‌

హైదరాబాద్‌ (ఎన్‌ టుడే న్యూస్‌): నిరుపేద మహిళలకు డబ్బు ఆశ చూపి వారి నుంచి అక్రమంగా అండాలు సేకరిస్తున్న ముఠా వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. సుమారు తొమ్మిది రాష్ట్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న ప్రధాన నిందితుడు అమిత్‌ శర్మ.. ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు, మహిళలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి అండాలు సేకరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, ఢిల్లీ, అస్సాం, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సుమారు 350 మంది మహిళల నుంచి అండాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.

మహిళలకు రూ.30 వేల కమీషన్‌..

మహిళలకు అండాల సేకరణకు ప్రతిఫలంగా రూ.30 వేల కమీషన్‌ చెల్లించడంతో పాటు ఆహారం, వసతి, రవాణా ఖర్చుల కింద మరో రూ.40 వేలు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ అండాలను ఐవీఎఫ్‌ కేంద్రాలకు అందించి ముఠా అంతకు రెట్టింపు మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

నివాసాలు, వసతిగృహాలే కేంద్రాలుగా కార్యకలాపాలు..

బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌, సరూర్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో ఉన్న నివాసాలు, వసతిగృహాలను కేంద్రాలుగా చేసుకుని ఈ కార్యకలాపాలు సాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హబ్సిగూడ, బంజారాహిల్స్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లోని ఐదు సంతాన సాఫల్య కేంద్రాల పేర్లు కూడా ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

అండాల సేకరణకు వైద్యారోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. నకిలీ ఆధార్‌ కార్డులు, అంగీకార పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

43 మంది మహిళల వాంగ్మూలాలు.. తొమ్మిది మంది అరెస్ట్‌

ఈ వ్యవహారంలో బాధితులుగా గుర్తించిన 43 మంది మహిళలను పోలీసులు రక్షించి, వారి నుంచి వాంగ్మూలాలు సేకరించారు. బేగంపేట, సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్లలో మొత్తం మూడు కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

ఈ అక్రమ వ్యవహారంలో ఐవీఎఫ్‌ కేంద్రాలు, ఆసుపత్రులకు చెందిన వైద్యుల ప్రమేయం ఉందా? ముఠాకు, సంతాన సాఫల్య కేంద్రాలకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహిళల ఆరోగ్యం, అంగీకారం, వైద్యపరమైన భద్రతకు సంబంధించిన అంశాలపైనా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.