BREAKING
thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి thumb ● సర్పంచ్ చొరవతో సింగారంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు thumb ● కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల పర్యవేక్షణ thumb ● జస్టిస్ కూనూరు లక్ష్మణ్‌ను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు thumb ● కూనూరు గోపాల్ ప్రజాసేవలు మరువలేనివి thumb ● సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
Test 4
Date of Publish : 25 November 2026, 07:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్‌ జంబ్లింగ్ విధానం రద్దు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 07:54 AM
23 వీక్షణలు

తెలంగాణ: ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఊరటనిచ్చింది. 2027 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విద్యార్థులు ఇకపై ఇతర కళాశాలలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ సొంత కళాశాలల్లోనే ప్రాక్టికల్ పరీక్షలు రాసే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో పరీక్షల సమయంలో ప్రయాణ ఇబ్బందులు, ఇతర కళాశాలల్లో ఏర్పడే అసౌకర్యాలు తగ్గనున్నాయి. బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 29న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, జనవరి 30న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. సైన్స్ విభాగానికి సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 18వ తేదీ వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. గతంలో జంబ్లింగ్ విధానం కారణంగా విద్యార్థులు తమ కళాశాలలను విడిచిపెట్టి ఇతర పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల ప్రయాణ సమయం, రవాణా ఖర్చులు, పరీక్షా కేంద్రాల మార్పుతో కొంత ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో జంబ్లింగ్ విధానాన్ని తొలగించి సొంత కళాశాలల్లోనే పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయం విద్యార్థులకు ఉపశమనం కలిగించనుంది. అయితే పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిబంధనల అమలుపై కళాశాలలు, పరీక్షల నిర్వాహకులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది.