BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 04:09 pm
Posted by : K MAHESH

అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు

తెలంగాణ
/ హన్మకొండ / కాజీపేట
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 04:09 PM
7 వీక్షణలు

ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరికాదు: డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి

వరంగల్ పశ్చిమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్

హనుమకొండ, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్: వరంగల్ నగర అభివృద్ధిపై చర్చించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని, రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన రాజకీయ పార్టీలు దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

బుధవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (డీసీసీ భవన్)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభివృద్ధి పనులపై చర్చించేందుకు చౌరస్తాకు రావాలని సవాల్ విసిరితే, బీఆర్ఎస్ నేతలు ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు ప్రయత్నించడం ఏమిటని ప్రశ్నించారు.

రాజకీయ ఉనికి కోసమే కేటీఆర్ పర్యటన

కేటీఆర్ వరంగల్‌కు వచ్చింది ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాదని, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికేనని ఇనగాల విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పదేళ్ల పాలనలో నగరాన్ని అభివృద్ధి చేయకుండా అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. సెంట్రల్ జైలును కూల్చి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూశారని, సరైన ప్రణాళిక లేకుండానే ఆసుపత్రి నిర్మాణం చేపట్టారని విమర్శించారు.

నగరంలో విద్యాసంస్థల నిర్మాణాలను కూడా మధ్యలోనే వదిలేశారని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వేల ఎకరాల భూములు దోపిడీకి గురయ్యాయని, పేపర్ లీకేజీలకు కూడా అప్పటి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ప్రజలు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను పక్కన పెట్టారని, ఆయన అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.

కాళోజీ కళాక్షేత్రంపై స్పష్టత

కాళోజీ కళాక్షేత్రం నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆదాయం సమకూరేలా అద్దెకు ఇచ్చే నిర్ణయం తీసుకున్నామని ఇనగాల తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి కబ్జాలకు తావులేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై ఒక్క కబ్జా ఆరోపణనైనా ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు.

వరంగల్ అభివృద్ధికి భారీగా నిధులు

వరంగల్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఇనగాల తెలిపారు. తాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.500 కోట్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.6,000 కోట్ల నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇస్తే స్వాగతిస్తామని, రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా అభివృద్ధిపై చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో దాడులకు దిగడం సరికాదని, ఇలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని హెచ్చరించారు.

ఈ మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, విజయశ్రీ రాజాలి, మామిండ్ల రాజు, తాడిశెట్టి విద్యాసాగర్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరూరి సాంబయ్య, మాజీ చైర్మన్ రామకృష్ణ, జిల్లా మీడియా సెల్ ఇన్‌చార్జి మార్క విజయ్ కుమార్, లీగల్ సెల్ చైర్మన్ తోట రాజకుమార్, నాయకులు పులి రాజు, బోడడిన్న, రహిమున్నీసా తదితరులు పాల్గొన్నారు.