BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 04:17 pm
Posted by : PAGADALA DEVAIAH

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు గౌరిదేవి రాజుకు ఎమ్మెల్యే పరామర్శ

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
25 Nov, 2026 - 04:17 PM
8 వీక్షణలు

కామినేని ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్: గుండె సంబంధిత సమస్యతో కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు గౌరిదేవి రాజును ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట డివిజన్, కర్మన్‌ఘాట్ పాత గ్రామానికి చెందిన గౌరిదేవి రాజు మంగళవారం సాయంత్రం కార్యాలయం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా నాగోల్ మార్గమధ్యంలో అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతినొప్పికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికుల సహకారంతో వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు.

రాజు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు గుండెపోటుగా అనుమానించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బుధవారం కామినేని ఆసుపత్రికి వెళ్లి రాజును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని, రాజు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులను కోరారు.

ఈ కార్యక్రమంలో ఉమ మహేశ్వరరావు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.