BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 02:18 pm
Posted by : PITCHERI MARREIAH

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
PITCHERI MARREIAH Varadaiah Palem Mandal Reporter
25 Nov, 2026 - 02:18 PM
9 వీక్షణలు

గొడవలకు పాల్పడితే కేసులు.. అవసరమైతే రౌడీషీట్‌ తెరుస్తాం: పుత్తూరు రూరల్ సీఐ రవీంద్ర

డ్రోన్లతో ప్రత్యేక నిఘా.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

పుత్తూరు: రేపు (నవంబర్ 26) జరగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని పుత్తూరు రూరల్ సీఐ రవీంద్ర కోరారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల భద్రత, నిబంధనలు, తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి మద్దతుదారులు సంయమనం పాటించాలని సూచించారు. గెలుపోటములను సహజంగా స్వీకరించాలని, ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి గొడవలకు తావివ్వకూడదని కోరారు. పోలీసు శాఖ సూచించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం పాటించాలి

పోలింగ్ బూత్‌లకు 100 మీటర్ల పరిధి నిబంధనను తప్పనిసరిగా పాటించాలని సీఐ సూచించారు. ఎన్నికల నియమావళిని, పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కేసులు నమోదైతే భవిష్యత్తులో జరిగే ఎన్నికల సందర్భాల్లోనూ వాటి ప్రభావం ఉండే అవకాశం ఉందని గుర్తుచేశారు.

గొడవలకు పాల్పడితే రౌడీషీట్‌ తెరుస్తాం

ఎవరైనా గొడవలకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైన సందర్భాల్లో రౌడీషీట్‌ తెరుస్తామని సీఐ హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తించి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు బాణసంచా కాల్చడం, డప్పు వాయిద్యాలతో ఊరేగింపులు నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గెలిచినవారు, ఓడినవారు ఎన్నికల ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని పరస్పర సహకారంతో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని కోరారు.

డ్రోన్లతో ప్రత్యేక నిఘా

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ వెల్లడించారు. డ్రోన్ల సహాయంతో ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని తెలిపారు. ఎక్కడైనా అల్లర్లు లేదా గొడవలు జరిగితే డ్రోన్‌ వీడియోల ఆధారంగా బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీషీటర్లు ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పుత్తూరు రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని నారాయణవనం, పిచ్చాటూరు, కేవీబీపురం మండలాలకు చెందిన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పోలీసు శాఖ సూచనలను పాటించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని సీఐ రవీంద్ర విజ్ఞప్తి చేశారు.