BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 05:14 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రైల్వే అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక సమావేశం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
25 Nov, 2026 - 05:14 PM
8 వీక్షణలు

జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి అధికారుల సానుకూల స్పందన

నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడి.. జమ్మికుంటలో వ్యాగన్ లోడింగ్, అన్‌లోడింగ్ పాయింట్ ఏర్పాటుకు అంగీకారం

సికింద్రాబాద్, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్: తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెండింగ్ పనుల వేగవంతంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టి సారించారు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. వివిధ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ల అభివృద్ధి, కొత్త సదుపాయాల కల్పన, రైళ్ల సంఖ్య పెంపు తదితర అంశాలపై చర్చించారు.

జమ్మికుంట, ఉప్పల్ స్టేషన్ల అభివృద్ధిపై చర్చ

జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రి చేసిన ప్రతిపాదనలపై అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ రెండు స్టేషన్ల అభివృద్ధిపై నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

జమ్మికుంటలో వ్యాగన్ ఓర్ లోడింగ్, అన్‌లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కూడా అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. అదేవిధంగా జమ్మికుంటలో రోడ్ అండర్ పాస్ నిర్మాణానికి అంగీకారం తెలిపారు.

కొండగట్టులో రైల్వే స్టేషన్ ఏర్పాటుపై అధ్యయనం

కొండగట్టు వద్ద రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి అధ్యయనం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణ పనులను 2028 చివరి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ అధికారులకు సూచించారు.

తిరుపతి, శబరిమలకు మరిన్ని రైళ్లు నడపాలని విజ్ఞప్తి

కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి మూడు లేదా నాలుగు సార్లు రైళ్లు నడిపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. శబరిమల యాత్ర సీజన్‌లో కరీంనగర్ నుంచి వారానికి కనీసం రెండు ప్రత్యేక రైళ్లు నడపాలని సూచించారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా రైళ్ల సదుపాయాన్ని కల్పించాలని కోరారు.

పెండింగ్ పనులపై అసంతృప్తి

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనుల పురోగతిపై బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా పనులను మరింత వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైల్వే అభివృద్ధి ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలని కోరారు.