BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 05:23 pm
Posted by : PAGADALA DEVAIAH

కల్తీ మిర్చి విత్తనాల వ్యవహారంపై న్యూ ఆనంద్ డిస్ట్రిబ్యూటర్ స్పందించాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
25 Nov, 2026 - 05:23 PM
8 వీక్షణలు

పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలి

50 ఎకరాలకు పైగా మిర్చి పంటకు నష్టం జరిగినట్లు సీపీఎం నేత అంతటి కాశన్న ఆరోపణ

తాడూరు, నవంబర్ 25 | ఎన్ టుడే న్యూస్:

తాడూరు మండలం గుంతకోడూరు గ్రామంలో మిర్చి సాగు చేసిన రైతులు నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయారని సీపీఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న ఆరోపించారు. గ్రామంలో కుబేరు, రాఖీ, సింభా రకాల మిర్చి విత్తనాలు సాగు చేసిన రైతులకు చెందిన 50 ఎకరాలకు పైగా పంట దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు.

అప్పులు చేసి సాగు చేసిన రైతులకు నష్టం

ఈ సందర్భంగా అంతటి కాశన్న మాట్లాడుతూ.. రైతులు అప్పులు చేసి, ఎంతో ఆశతో పెట్టుబడులు పెట్టి మిర్చి పంట సాగు చేశారని పేర్కొన్నారు. అయితే విత్తనాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పంట ఆశించిన స్థాయిలో దిగుబడి ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

డిస్ట్రిబ్యూటర్ స్పందించాలని డిమాండ్

కుబేరు, రాఖీ, సింభా మిర్చి విత్తనాలకు సంబంధించిన న్యూ ఆనంద్ డిస్ట్రిబ్యూటర్ చిన్నపరెడ్డి ఈ వ్యవహారంపై వెంటనే స్పందించాలని కాశన్న డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలని కోరారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రైతులకు జరిగిన నష్టానికి బాధ్యత వహించి వారిని ఆదుకోవాల్సిన అవసరం విత్తన కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లపై ఉందని ఆయన పేర్కొన్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు సీపీఎం పార్టీ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రైతులు చెన్న మల్లేష్, ఎండీ షబీర్, కొరపాల బాలరాజు, గణేష్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.