BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 05:20 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అత్తకు తలకొరివి పెట్టిన కోడలు.. కన్నీళ్లు పెట్టించిన ఆప్యాయత

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
25 Nov, 2026 - 05:20 PM
14 వీక్షణలు

భర్త, కుమారుడిని కోల్పోయిన వృద్ధురాలికి చివరి వరకు అండగా నిలిచిన కోడలు కౌసల్య

మనవడి భార్య గర్భవతి కావడంతో కుమారుడి స్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహణ

ఏన్కూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్: రక్తసంబంధం కంటే ప్రేమాభిమానాలు, బాధ్యతలే గొప్పవని చాటిచెప్పిన హృదయాన్ని కదిలించే ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏన్కూరు మండలం జెన్నారం గ్రామంలో చోటుచేసుకుంది. అత్త మరణించడంతో కోడలు కౌసల్య కుమారుడి స్థానంలో నిలబడి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అత్తకు తలకొరివి పెట్టి తన అనుబంధాన్ని చాటుకున్నారు.

గ్రామానికి చెందిన 80 ఏళ్ల గోంగూర సావిత్రమ్మ వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె భర్త, ఏకైక కుమారుడు గతంలోనే మరణించడంతో వృద్ధాప్యంలో సావిత్రమ్మకు కోడలు కౌసల్య అండగా నిలిచారు. ఎన్నో ఏళ్లుగా అత్తకు అవసరమైన సేవలు అందిస్తూ, కంటికి రెప్పలా చూసుకున్నారు. వయసు మీద పడినప్పటికీ ఆమెను ఒంటరిగా వదలకుండా తన బాధ్యతగా భావించి సేవలు చేశారు.

కుమారుడి స్థానంలో నిలిచిన కోడలు

సావిత్రమ్మ మరణానంతరం అంతిమ సంస్కారాలు నిర్వహించే సమయంలో మరో పరిస్థితి ఎదురైంది. మనవడి భార్య గర్భవతిగా ఉండటంతో సంప్రదాయం ప్రకారం మనవడు తలకొరివి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కోడలు కౌసల్య స్వయంగా ముందుకు వచ్చి కుమారుడి స్థానంలో నిలబడి అత్తకు తలకొరివి పెట్టారు. అంతేకాకుండా అంతిమ సంస్కారాలను కూడా స్వయంగా నిర్వహించారు.

గ్రామస్తుల ప్రశంసలు

అత్తకు చివరి వరకు సేవలు అందించడమే కాకుండా, ఆమె అంతిమ సంస్కారాలను కూడా బాధ్యతగా నిర్వహించిన కౌసల్యను గ్రామస్తులు, బంధువులు అభినందించారు. రక్తసంబంధం లేకపోయినా ప్రేమ, ఆప్యాయత, బాధ్యతలతో కుటుంబ బంధాలను నిలబెట్టుకోవచ్చని ఈ ఘటన చాటిచెప్పింది. అత్త పట్ల కోడలు చూపిన అనుబంధం గ్రామంలో పలువురిని భావోద్వేగానికి గురిచేసింది.