BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 05:14 pm
Posted by : K MAHESH

వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 05:14 PM
7 వీక్షణలు

బాధిత కుటుంబానికి కలెక్టర్ భరోసా కల్పించాలి

రాజీకి ప్రయత్నిస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: NPRD తెలంగాణ జిల్లా కమిటీ

భువనగిరి, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని ఎం. ఆత్మకూరు మండలం తుక్కాపూర్ గ్రామంలో బహుళ వైకల్యం కలిగిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళపై అత్యాచారం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని కోరింది.

ఈ మేరకు కమిటీ విడుదల చేసిన ప్రకటనలో.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఒంటరిగా ఉన్న వికలాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయని పేర్కొంది. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

బాధిత కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు

గ్రామానికి చెందిన కొందరు నాయకులు బాధిత కుటుంబంపై ఒత్తిడి తెచ్చి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని కమిటీ తెలిపింది. ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడుతున్న వారిపై కూడా విచారణ జరిపి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాధితురాలికి న్యాయం జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఏ రూపంలో ఉన్నా వాటిని అరికట్టాలని కోరింది.

చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలి

ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం–2016 (RPwD Act) ప్రకారం వర్తించే నిబంధనల మేరకు కేసు నమోదు చేయాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని కోరింది.

ఘటనపై జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి (DWO) స్పందించకపోవడంపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. గ్రామంలోని కొందరు రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపైనా విచారణ జరపాలని కోరింది.

రాష్ట్ర మహిళా కమిషన్ తక్షణమే స్పందించి, బాధితురాలికి న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని NPRD తెలంగాణ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది.

ప్రకటన విడుదల చేసిన వారు:

  • స్వరూపంగా ప్రకాష్ – జిల్లా అధ్యక్షుడు

  • వనం ఉపేందర్ – జిల్లా ప్రధాన కార్యదర్శి

  • బొల్లేపల్లి స్వామి – జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్

  • కె. లలిత – NPRD మహిళా విభాగం జిల్లా కన్వీనర్