BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 03:01 pm
Posted by : K MAHESH

నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 03:01 PM
7 వీక్షణలు

సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపు

నర్సంపేట, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ నెల 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ద్వారకాపేట బైపాస్ రోడ్డులోని ఎంఏఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డిలు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచిందన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో చేపట్టిన దీక్ష రాష్ట్ర సాధన ఉద్యమానికి మరింత ఊపునిచ్చిందని, వివిధ వర్గాలను ఏకం చేసిందని పేర్కొన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా ముందుండి నడిపించే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లేకుండా నిర్వహిస్తున్న తొలి కార్యక్రమం ఇదేనని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ నెల 29న నర్సంపేటలో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.