BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 05:11 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య కుట్ర?

తెలంగాణ
/ మహబూబ్ నగర్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
25 Nov, 2026 - 05:11 PM
10 వీక్షణలు

మహబూబ్‌నగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ఉదండాపూర్‌కు చెందిన 23 ఏళ్ల మల్లికార్జున్ హత్య.. భార్య, ప్రియుడిపై అనుమానాలు

మహబూబ్‌నగర్, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య ఉదంతం మహబూబ్‌నగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు చెందిన మల్లికార్జున్ (23) హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధం, కుటుంబానికి అందిన పరిహారం డబ్బులే కారణమై ఉండవచ్చని ప్రాథమిక కథనాలు వెల్లడిస్తున్నాయి.

బస్సు ప్రయాణంలో పరిచయం.. వివాహేతర సంబంధం

వివరాల ప్రకారం.. సుమారు రెండు నెలల క్రితం శ్రీశైలం బస్సు ప్రయాణంలో మల్లికార్జున్‌కు శివ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం క్రమంగా మల్లికార్జున్ భార్య అంజమ్మతో శివకు వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం.

రూ.18 లక్షల పరిహారంపై కన్ను?

ఉదండాపూర్ జలాశయం ముంపు పరిహారంగా మల్లికార్జున్ కుటుంబానికి రూ.18 లక్షలు అందినట్లు తెలుస్తోంది. ఈ డబ్బును దక్కించుకునేందుకు భర్తను హత్య చేసి, పరిహారంగా వచ్చిన మొత్తాన్ని చెరిసగం పంచుకోవాలని అంజమ్మ, శివ ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కూలి పని ఉందంటూ పిలిచి హత్య

ఈ నెల 20న రాత్రి కూలి పని ఉందని చెప్పి మల్లికార్జున్‌ను శివ పిలిపించినట్లు సమాచారం. అనంతరం అతడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నెమళ్లగుట్ట సమీపంలో మల్లికార్జున్ మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. హత్య వెనుక గల కారణాలు, ఇతరుల ప్రమేయం, నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.