BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 02:53 pm
Posted by : KOPURI LAKSHMAN

బాలల భద్రత, హక్కులపై విద్యార్థులకు న్యాయ విజ్ఞాన అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
25 Nov, 2026 - 02:53 PM
9 వీక్షణలు

పోక్సో చట్టం, బాల్యవివాహాల నిరోధంపై వివరించిన నందిగామ బార్ అసోసియేషన్ ప్యానల్ అడ్వకేట్ రాంబాబు

ఎన్ టుడే న్యూస్ – ఎన్టీఆర్ జిల్లా: వీరులపాడు మండలం జుజ్జూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల భద్రత, హక్కులపై న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిగామ బార్ అసోసియేషన్ ప్యానల్ అడ్వకేట్ రాంబాబు పాల్గొని విద్యార్థులకు పలు చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో చట్టం, బాలల హక్కులు, బాల్యవివాహాల నిరోధానికి సంబంధించిన చట్టపరమైన నిబంధనలను వివరించారు. బాలలపై జరిగే లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు చట్టం కల్పిస్తున్న హక్కులు, భద్రతా చర్యల గురించి విద్యార్థులకు తెలియజేశారు.

ముఖ్యంగా బాలికలు ఎదుర్కొనే వేధింపుల విషయంలో భయపడకుండా ధైర్యంగా ఉండాలని, అలాంటి ఘటనలు ఎదురైతే మౌనంగా ఉండకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తమ భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.