BREAKING
thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్ thumb ● వికలాంగురాలిపై లైంగిక దాడి ఆరోపణలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి thumb ● అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. దాడులకు దిగితే సహించేది లేదు thumb ● గంగారం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● నవంబర్ 29న నర్సంపేటలో ‘దీక్షా దివస్’ సభ thumb ● పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలి thumb ● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ thumb ● వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి thumb ● ఎల్కతుర్తి గ్రామంలో సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● నిరుపేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● గణిత శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ పొందిన పుట్టపాక వాసి వాస విజయ్ కుమార్
Test 4
Date of Publish : 25 November 2026, 03:25 pm
Posted by : PAGADALA DEVAIAH

పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోంది

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
25 Nov, 2026 - 03:25 PM
8 వీక్షణలు

వినికిడి సమస్యతో బాధపడుతున్న 16 ఏళ్ల బాలుడికి రూ.6 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

బాధిత కుటుంబానికి చెక్కు అందజేసిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్: ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స చేయించుకోలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CM Relief Fund) ఎంతో ఉపయోగపడుతోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని పోచమ్మగడ్డలో నివాసం ఉంటున్న బాలకృష్ణ కుమారుడు అభిరామ్ (16)కు వైద్య చికిత్స నిమిత్తం రూ.6 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది.

అభిరామ్ పుట్టినప్పటి నుంచి వినికిడి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో బాలుడి కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని సంప్రదించి తమ పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. బాలుడి చికిత్సకు అవసరమైన వివరాలను సేకరించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేయించారు.

వినికిడి సమస్య తీవ్రంగా ఉన్నవారికి వినికిడి సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడే ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరం కొనుగోలు కోసం రూ.6,00,000 విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) మంజూరైంది. ఈ మేరకు మంజూరైన చెక్కును ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బాధిత బాలుడి తండ్రి బాలకృష్ణకు అందజేశారు.

పేదలకు సేవ చేయడం సంతృప్తినిస్తుంది: ఎమ్మెల్యే

ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలకు సేవ చేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పేద కుటుంబాలకు సహాయం చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని వారికి ప్రభుత్వ సహాయనిధి ద్వారా అండగా నిలిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు

తమ కుమారుడి ఆరోగ్య సమస్యను తెలుసుకుని ప్రత్యేక చొరవ తీసుకొని చికిత్స కోసం ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమారుడి చికిత్స కోసం రూ.6 లక్షల ఎల్‌ఓసీ మంజూరయ్యేలా సహకరించిన ఆయన మద్దతును జీవితాంతం మరువలేమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాకేష్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.