BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 07:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గుత్తా కృష్ణకుమారికి వైఎస్సార్‌సీపీ మద్దతు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 07:25 PM
10 వీక్షణలు

సర్పంచ్ ఎన్నికల బరిలో రాజకీయ సమీకరణాలు.. అభ్యర్థి దంపతులకు వైసీపీ నాయకుల సత్కారం

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విస్సన్నపేట గ్రామంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గ్రామ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుత్తా కృష్ణకుమారి (భర్త సుబ్రహ్మణ్యం)కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యర్థి దంపతులను కలిసి ఎన్నికల్లో విజయానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడించారు.

ఈ సందర్భంగా గుత్తా కృష్ణకుమారి, సుబ్రహ్మణ్యం దంపతులను వైసీపీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి, నెక్కలపు కుటుంబరావు, శిరసాని ప్రకాష్, ఓలేటి దుర్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా గుత్తా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, తాము స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డితో కలిసి పార్టీ నాయకులను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు వివరించారు. తమ విజ్ఞప్తికి స్పందించి వైఎస్సార్‌సీపీ నాయకులు బహిరంగంగా మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల్లో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

విస్సన్నపేట గ్రామంలో స్వతంత్ర అభ్యర్థికి వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించడం స్థానిక ఎన్నికల రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.