BREAKING
thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు thumb ● దశదిన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం thumb ● కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పిన ప్రభుత్వం! thumb ● Parents Meeting: నెల 5న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ thumb ● జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ thumb ● ఈనెల 13 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ thumb ● స్పిరిట్ కోసం భారీ సెట్.. ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! thumb ● విశ్వవిజేతలుగా నిలిచి ఏడాది.. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం! thumb ● హరీశ్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిద్దిపేటకు దర్యాప్తు బదిలీ thumb ● బీసీ హాస్టల్‌లో వార్డెన్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన విద్యార్థులు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 04:12 pm
Posted by : PAGADALA DEVAIAH

జర్నలిస్ట్ భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో మృతి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
02 Nov, 2026 - 04:12 PM
30 వీక్షణలు

వెలమకన్నే గ్రామంలో భౌతికకాయానికి డీయూడబ్ల్యూజే, ఐజేయూ నేతల నివాళులు

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రజాశక్తి, సూర్య దినపత్రికల్లో ఎల్బీనగర్‌ నియోజకవర్గం మన్సూరాబాద్‌ ప్రాంత జర్నలిస్టుగా పనిచేసిన భీమనపల్లి శేఖర్‌ గుండెపోటుతో ఆదివారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శేఖర్‌ మృతి విషయం తెలుసుకున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర నాయకులు, సీనియర్‌ జర్నలిస్ట్‌ జె. కిషన్‌ (రాధాకిషన్‌), జిల్లా సంయుక్త కార్యదర్శి గొల్లంపల్లి ఆంజనేయులు, ట్రెజరర్‌ శశిపాల్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టులు బాణాల మధుసూదనాచారి, చాపల శ్రీనివాస్‌, నర్రి రమేష్‌, దేవయ్య తదితరులు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం వెలమకన్నే గ్రామానికి చేరుకున్నారు.

అక్కడ శేఖర్‌ భౌతికకాయంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. భవిష్యత్తులో శేఖర్‌ కుటుంబానికి అండగా ఉంటామని ఐజేయూ నాయకులు భరోసా ఇచ్చారు.