శస్త్రచికిత్స అనంతరం పులి శాంతికి కదిరి బాబురావు పరామర్శ
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
కనిగిరి:
కనిగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పులి శాంతి ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే, విశాఖపట్నం పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబురావు సోమవారం కనిగిరిలోని ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా పులి శాంతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పులి రాధాకృష్ణారెడ్డి, సిరుపా గోవర్ధన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు షేక్ ఫయాజ్, పోలిచర్ల రహీమ్ బాషా, రషీద్, మార్తల రామురెడ్డి, హరి, షేక్ షరీఫ్, రహిమాన్, కరీముల్లా, కె. వెంకట నరసయ్య, ఎస్. అంజనాద్రి తదితరులు పాల్గొన్నారు.