BREAKING
thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● అర్నబ్ తుఫాన్‌ నష్టాలను పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ఎల్‌నినో కరువు ప్రభావంపై అవగాహనకు ఫ్లెక్సీ ప్రదర్శన
మంచి మాట
Date of Publish : 29 October 2026, 10:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిత్తపూరులో లిబరేషన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Oct, 2026 - 10:09 PM
25 వీక్షణలు

మతోన్మాద శక్తులను ఓడిద్దాం.. రాజ్యాంగాన్ని కాపాడుదాం విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక సమానత్వం కోసం పోరాడుదాం చిత్తపూరు, ఏలూరు జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామం నుంచి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డి. హరినాథ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఏలూరు జిల్లా పరిషత్ చాట్రాయి స్థానం నుంచి పోటీ చేస్తున్న దుర్గం పుల్లారావు, చిత్తపూరు ఎంపీటీసీ స్థానం నుంచి బరిలో ఉన్న కలపాల జ్యోతికి మద్దతుగా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరినాథ్ మాట్లాడుతూ మతోన్మాద, ఫాసిస్ట్ శక్తులను ఓడించాలని, విద్య, వైద్యం, ఉపాధి, గౌరవప్రదమైన జీవనం ప్రతి ఒక్కరికీ అందేలా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమానత్వం సాధించేందుకు ప్రజలు సంఘటితంగా ముందుకు రావాలని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, అర్హులైన పేదలకు నివాస గృహాలు, మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు అర్హులైన వారికి పెన్షన్లు అందేలా కృషి చేయాలని కోరారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే ఎర్రజెండా నాయకులు దుర్గం పుల్లారావు, కలపాల జ్యోతిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మూడు నక్షత్రాల గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ చాట్రాయి మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యుడు చాట్ల బాబురావు, దుర్గం పూజిత, పరికల కళావతి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.