అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా
గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీటీసీ అభ్యర్థి పొన్నపాల మోహన్
అంజూరు, అక్టోబర్ 29 (ఎన్ టుడే న్యూస్): అంజూరు ఎంపీటీసీ పరిధిలోని గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే జనసేన పార్టీ అజెండా అని ఆ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి పొన్నపాల మోహన్ తెలిపారు. గురువారం ఎంపీటీసీ పరిధిలోని వివిధ గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పవన్ కల్యాణ్ ఆశయాలతో ఎన్నికల బరిలోకి
ఈ సందర్భంగా పొన్నపాల మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ఆశయాలు, ఆలోచనలతో స్ఫూర్తి పొంది గ్రామాల అభివృద్ధి కోసం ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి
అంజూరు ఎంపీటీసీ పరిధిలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం అవసరమని మోహన్ అన్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు మద్దతు తెలిపి, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.