ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
నారాయణపూర్
ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు
సంస్థాన్ నారాయణపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సిహెచ్. నవీన్ కుమార్, వార్డు సభ్యులు గాంధీజీకి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పందుల యాదగిరి గౌడ్, కట్ల వనజ భాస్కర్ చారి, సభావత్ రఘునాయక్, చింతల శైలజ సత్యనారాయణ, సింగపంగా ప్రశాంతి రమేష్, నీళ్ల అనిత శంకర్, చిలువేరు రమాదేవి శంకర్, బల్గూరి శివసాగర్, పట్నం బాలకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.
అలాగే మాజీ సర్పంచ్ కోన్‌రెడ్డి నరసింహ, పద్మశాలి సహకార సంఘం చైర్మన్ చిలుకూరి శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దుల మురళి యాదవ్, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, కాంగ్రెస్ యువజన కార్యదర్శి కొండ నవీన్ గౌడ్, కారోబార్ పున్నం యాదగిరి, కాంగ్రెస్ యువజన నాయకులు భానోతు కిరణ్ నాయక్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.