BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 13 October 2026, 06:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భార్యకు నరకం చూపి.. మరో మహిళతో సహజీవనం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Oct, 2026 - 06:23 PM
4 వీక్షణలు

ప్రైవేట్ టీచర్‌కు 30 రోజుల జైలు శిక్ష

మార్కాపురం జిల్లా / గిద్దలూరు:

సమాజానికి నీతి, నైతిక విలువలు బోధించాల్సిన ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు కుటుంబ బాధ్యతలను విస్మరించి వివాదంలో చిక్కుకున్నాడు. తాళి కట్టిన భార్యను, కన్న కొడుకును పట్టించుకోకుండా వదిలేసి, మరో మహిళతో సంబంధం కొనసాగిస్తూ మొదటి భార్యను వేధింపులకు గురిచేశాడనే కేసులో చివరకు కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళితే.. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కె.ఎస్. పల్లి (KS పల్లి) గ్రామానికి చెందిన అమీర్ బాషా ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం నుంచి తన భార్య, కుమారుడిని పట్టించుకోకుండా దూరంగా ఉంటున్నాడని, వారి కనీస అవసరాలకు కూడా ఆర్థిక సహాయం చేయకుండా నిర్లక్ష్యం చేశాడని బాధితురాలు ఆరోపించింది.

భర్త తనను, తన కుమారుడిని పోషించాల్సిన బాధ్యతను విస్మరించడమే కాకుండా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడని బాధితురాలు పేర్కొంది. ఆ సంబంధం ద్వారా వారికి ఓ పాప కూడా జన్మించిందని తెలిపింది.

ఈ పరిణామాల నేపథ్యంలో మొదటి భార్యకు తీవ్ర మానసిక వేదన ఎదురైందని, తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపిస్తూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో విచారణ కొనసాగింది.

కేసును విచారించిన న్యాయమూర్తి భరత్ చంద్ర, ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అనంతరం నిందితుడు అమీర్ బాషాకు 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మార్కాపురం సబ్‌జైలుకు తరలించారు.

భార్య, కుమారుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కుటుంబ వివాదంలో కోర్టు శిక్ష విధించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వివాదంలో చిక్కుకోవడంపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు.